మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధానపాత్రల్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’.జూనియర్ నటిస్తున్న తొలి హిందీ చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. వచ్చే గురువారం పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విడుదలకు కేవలం ఐదు రోజులే ఉన్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. అయితే ఈ సినిమాకి సంబన్హదించి ఇంతవరకూ ఒక్క పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో తారక్ ఫ్యాన్స్ కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆ లోటును తీరుస్తూ అభిమానులకు తాజాగా సాలిడ్ అప్డేట్ అందించారు మేకర్స్.
ఈ మేరకు రేపు హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ‘వార్ 2’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా “ది మ్యాన్ ఆఫ్ మాసెస్, ది గ్రీక్ గాడ్, ఒక ఎపిక్ నైట్ కోసం మీ క్యాలెండర్‌లో డేట్‌ని మార్క్ చేసి పెట్టుకోండి” అని సోషల్ మీడియాలో పేర్కొంది చిత్ర యూనిట్. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా ఈ చిత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా గతంలో వచ్చిన ‘వార్’ మూవీకి సీక్వెల్‌గా వస్తుంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. కియారా అద్వానీ హీరోయిన్‌గా, అశుతోష్ రాణా మరో కీలక పాత్రలో నటించారు. ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించడం, ఒకే పాటలో ఇద్దరూ అదిరిపోయే డ్యాన్స్ చేయడం, అలాగే కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే వార్ 2 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రం కూడా ఆగస్టు 14నే విడుదలవుతోంది. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నుండి వస్తోన్న సినిమా కావడం, కింగ్ నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు, హీరోయిన్ శ్రుతి హాసన్ నటించడంతో, ఈ భారీ మల్టీ స్టారర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఎవరు పై చేయి సాధిస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























