150 కోట్ల క్లబ్ లో మహావతార్ నరసింహ

Mahavatar Narsimha Enters the 150 Crore Club

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. మూడో వారం లోనూ ఈసినిమా ఏ మాత్రం స్లో అవ్వకుండా సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. ఈసినిమా నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా కేవలం మౌత్ టాక్ తో సెన్సేషనల్ వసూళ్లను రాబడతూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఆదివారంతో ఈసినిమా 200 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా హిందీలో అయితే సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.కొత్త సినిమాలతో పోటీని తట్టుకొని అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది. నిన్నటితో హిందీ వెర్షన్ 85కోట్ల నెట్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈవారంలో కేవలం హిందీ లోనే 100కోట్ల ను సొంతం చేసుకోనుంది.

ట్రెండ్ చూస్తుంటే మహావతార్ నరసింహ ఫుల్ రన్ లో 250 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకునేలా వుంది.లిమిటెడ్ బడ్జెట్లో వచ్చిన ఈసినిమా బయ్యర్లకు జాక్ పాట్ లా మారింది.అటు నార్త్ అమెరికా లోనూ ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటితో అక్కడ 600K డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.

ఇక తెలుగులోనూ ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈసినిమాను తెలుగులో విడుదలచేశారు.విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.