కూలీ థియేటర్లలో నాగార్జున కల్ట్ క్లాసిక్ ట్రైలర్

Nagarjuna-RGV's Shiva Trailer to be Screened in Theatres During Coolie Shows

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కూలీ’. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, స్టార్ యాక్ట్రెస్ శ్రుతి హాసన్ వంటి అగ్రతారలు నటించారు. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో కూలీ థియేటర్లలో ఆడియెన్స్‌కి ఒక స్వీట్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ప్రదర్శించనున్న థియేటర్లలో హీరో నాగార్జున కల్ట్ క్లాసిక్ మూవీ ‘శివ’ ట్రైలర్‌ను స్క్రీనింగ్ చేయనుంది. కాగా నాగ్ కెరీర్‌ తొలినాళ్లలో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్‌గా పరిచయమవడం గమనార్హం. 1989లో విడుదలైన ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. తెలుగు సినిమా దశ, దిశను మార్చిన చిత్రంగా దీనిని వర్ణిస్తారు సినీ పండితులు. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో సైతం ఘనవిజయం సాధించింది.

అయితే ఇంతటి చరిత్ర కలిగిన ఈ కల్ట్ క్లాసిక్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ నిర్మాణ సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శివ చిత్రం రీరిలీజ్ కాబోతుండటం విశేషం. సరికొత్త సాంకేతిక హంగులతో 4K డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ మూవీని రీ-రిలీజ్ చేయనున్నట్లు హీరో నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. అలాగే దీనిపై నాగ్ తనయుడు, హీరో నాగచైతన్య కూడా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.