మావెరిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మచ్ అవైటెడ్ మూవీ ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి పాపులారిటీ పెరిగిన నేపథ్యంలో గ్లోబల్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. హాలీవుడ్ టర్న్డ్ బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా, కన్నడ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సహా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలో విదేశాల్లో మూడో షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. మహేష్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ బయటకి వచ్చినా అభిమానులలో ఉత్సాహం రేపుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.
దర్శకుడు రాజమౌళి ఈ ప్రీ లుక్ పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రివీల్ చేశారు. ఈ సందర్భంగా నవంబర్‌లో మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తానని మాట ఇచ్చారు. అలాగే దీనికి #GlobeTrotter అనే హ్యాష్‌ట్యాగ్‌ని యాడ్ చేశారు. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. సూపర్ స్టార్ అభిమానులు దీనిని పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు.
మరోవైపు ఈ ప్రీ లుక్ గురించి హీరో మహేష్ బాబు కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన తన అభిమానులు మరియు సహనటులు కొందరు సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ గురించి ప్రశ్నించగా, అందుకు ఆయన బదులిస్తూ.. నాకు కూడా మీ అందరిలాగే నా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసుకోవాలని కోరికగా ఉంది. రాజమౌళి గారు ఎప్పుడెప్పుడు దీనిని రివీల్ చేస్తారా, అని ఎదురుచూస్తున్నా.. నవంబర్‌లో మీతోపాటు నేను కూడా ఒకేసారి దానిని వీక్షిస్తా” అని చెప్పారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























