కూలీలో నాగ్‌ని చూసి ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారు – సురేష్ బాబు

Producer Suresh Babu Hails King Nagarjuna’s Mesmerizing Presence in Coolie

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కూలీ’. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగస్టు 14న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా  మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ మరియు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. లోకేష్ తీసిన ‘ఖైదీ, విక్రమ్’ సినిమాలు నాకు ఎంతగానో ఇష్టం. బ్యాడ్ బాయ్ క్యారెక్టర్‌లో నాగార్జునని చూడడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఆడియన్స్ కూడా చాలా మెస్మరైజ్ అవుతారు, యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా టీమ్ అందరికీ గొప్ప సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.