చివరి దశ షూటింగ్ లో పరాశక్తి

Parasakthi is in the final stage of shooting

తమిళ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా పరాశక్తి షూటింగ్ తుది దశకు చేరుకుంది.నిన్న పొల్లాచ్చిలో కీలకమైన షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. దాంతో 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులో తెలుగు హీరో రానా కూడా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈవిషయంలో క్లారిటీ రావాల్సివుంది.ఇక శ్రీలీలకు తమిళ్ లో ఇదే మొదటి సినిమా.జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఈసినిమా కన్నా ముందు శివ కార్తికేయన్ ,మదరాసితో రానున్నాడు.మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 5న మదరాసి థియేటర్లలోకి రానుంది.అమరన్ తరువాత శివ కార్తికేయన్ నుండి వస్తున్న సినిమా కావడంతో మదరాసి పై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.