కన్నడ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ హోంబాలే బ్యానర్ నుండి వచ్చిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ సంచలనం సృష్టిస్తుంది.ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా కేవలం మౌత్ టాక్ తో 100కోట్ల వసూళ్లను రాబట్టుకొని ప్రస్తుతం ఇండియాలో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో కొనసాగుతుంది.శని ,ఆది వారాల్లోనే ఈసినిమా 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందంటే రన్ ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.అన్ని భాషల్లో ఈసినిమా హవా కొనసాగిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా హిందీలో అయితే సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.కొత్త సినిమాలతో పోటీని తట్టుకొని అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది.నిన్న ఒక్క రోజే హిందీ వెర్షన్ 16కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో 10రోజుల్లో 65కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈవారంలో కేవలం హిందీ లోనే 100కోట్ల ను సొంతం చేసుకుంది.
ట్రెండ్ చూస్తుంటే మహావతార్ నరసింహ ఫుల్ రన్ లో 200 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకునేలా వుంది.లిమిటెడ్ బడ్జెట్లో వచ్చిన ఈసినిమా బయ్యర్లకు జాక్ పాట్ లా మారింది. అటు నార్త్ అమెరికా లోనూ ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటితో అక్కడ 250K డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.
ఇక తెలుగులోనూ ఈసినిమా అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈసినిమాను తెలుగులో విడుదలచేశారు. విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























