విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.ఇక హిట్ టాక్ రావడంతో కింగ్డమ్ టీం ఈరోజు సాయంత్రం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇందులో కింగ్డమ్ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ… సినిమాకు మంచి టాక్ వస్తుంది.సెకండాఫ్ లో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి కానీ అవి పట్టించుకోకుండా థియేటర్స్ కి వచ్చి చూడండి. మీరు ఏ మాత్రం ఎంజాయ్ చేయలేదు అంటే మాకు ఫోన్ చేసి తిట్టొచ్చు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి.ఫస్ట్ డే యుఎస్ లో 50 శాతం రికవరీ చేసింది.సీడెడ్ కూడా సగానికి పైగా రికవరీ చేసింది అలాగే నైజాంలో సూపర్ గా కలెక్షన్స్ వస్తున్నాయి.ఫస్ట్ డే 7 కోట్లకుపైనే గ్రాస్ రానుంది.ఓవరాల్ గా ఫస్ట్ డే 35 నుండి 40కోట్ల వరకు గ్రాస్ వస్తుందని అనుకుంటున్నట్లు నాగవంశీ తెలిపారు.ఆ లెక్కన ఈసినిమా విజయ్ కెరీర్ లో బిగెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించనుంది.ఇదే జోరు కొనసాగితే ఆదివారం వరకు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.ఇక ఎట్టకేలకు ఈసినిమాతో విజయ్ దేవరకొండ కం బ్యాక్ ఇచ్చాడు.గత కొన్నేళ్ల నుండి వరుస పరాజయాలు చవి చూస్తున్న విజయ్ కి కింగ్డమ్ కావాల్సిన సక్సెస్ ను అందించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























