కూలీ ప్రమోషన్స్ కొంచెం కొత్తగా

Coolie Promotions Stand Out with New Approach

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ కూలీ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర బృందం.డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అయితే గతంలో తన నుండి వచ్చిన ఏ సినిమాకు చేయని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు.ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా కాస్త డిఫ్రెంట్ గా చేస్తున్నారు.ఇందుకోసం ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తో టై అప్ అయ్యారు.అమెజాన్ నుండి వెళ్లే ఆర్డర్స్ మీద కూలీ పోస్టర్ లను వేసి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు.దాంతో సినిమాగా జనాలకు బాగా రీచ్ అవుతుందని ఇలా క్రియేటివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు ఆగస్టు 2 న చెన్నై లో భారీ ఈవెంట్ జరుగనుంది.దీనికి కూలీ టీం అంతా హాజరుఅవుతుంది. అనిరుధ్ లైవ్ పెర్ఫర్మ్ కూడా చేయనున్నాడు.అలాగే వచ్చే వారంలో తెలుగులోనూ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.ఇలా వరుస ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ మరింతగా పెంచుతున్నారు మేకర్స్.

లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా ఉపేంద్ర ,సత్య రాజ్ ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.ఆగస్టు 2న ట్రైలర్ విడుదలకానుంది.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. అయితే ఈసినిమాకు తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.కూలీ విడుదలవుతున్న రోజే వార్ 2 కూడా వస్తుంది.ఎన్టీఆర్ ఉండడం తో వార్ 2పై భారీ అంచనాలు వున్నాయి.సో బాక్సాఫీస్ వద్ద కూలీకి పోటీ తప్పదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.