రష్మిక మందన్న ‘మైసా’.. గ్రాండ్‌ లాంచ్

Rashmika Mandanna's New Film MYSA Launched

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న ‘మైసా’ అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైసా ఈ రోజు పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. దీనికి కోర్ టీం హాజరయ్యారు. సురేష్ బాబు క్లాప్‌ కొట్టారు. రవి కిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేసిన హను రాఘవపూడి ముహూర్తపు షాట్‌కు గౌరవ దర్శకత్వం చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.

ఈ మొదటి షెడ్యూల్‌లో రష్మిక టీంలో జాయిన్ కానుంది. మైసా గోండ్ తెగల బ్యాక్‌డ్రాప్‌లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవాతర్‌లో కనిపిస్తుంది.

కాగా ఈ చిత్రానికి సూర్య ‘రెట్రో’ సినిమాకి పని చేసిన శ్రేయాస్ పి కృష్ణ డీవోపీగా పని చేస్తున్నారు. ‘కల్కి 2898 ఏ డీ’ ఫేమ్ ఆండి లాంగ్ యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. మిగతా టెక్నిషియన్స్ విషయంలో సర్ప్రైజెస్ వుండనున్నాయి. మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో రివీల్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని ఎక్సైటింగ్ అప్‌డేట్స్ రానున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.