టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ శనివారం రాత్రి తిరుపతిలో భారీ ఈవెంట్ నిర్వహించి కింగ్డమ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించి అదరగొట్టేసాడు. దీంతో మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరుకున్నాయి. ప్రస్తుతం కింగ్డమ్ ట్రైలర్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ అభిమానులకు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది. కింగ్‌డమ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని తెలిపింది. ఈ మేరకు బుక్ మై షోలో ‘https://in.bookmyshow.com/movies/devarakonda/kingdom/ET00433664‘ లింక్ ద్వారా టికెట్స్ పొందవచ్చని సూచించింది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























