సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. సినిమా ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ఉరఫ్ డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ మూవీకి గ్యాని సంగీతం సమకూరుస్తుండగా.. రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీగా, భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























