మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోంది. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్, సురభి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే హిందీ నటుడు కునాల్ కపూర్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన అద్భుతమైన పోస్టర్లు, విజువల్ వండర్ టీజర్, ఆధ్యాత్మికంగా నిండిన ఫస్ట్ సింగిల్ ‘రామరామ’ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. తాజాగా విశ్వంభర ఫైనల్ షెడ్యూల్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా తొలుత అదిరిపోయే స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు.
అయితే ఈ పాటకు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. ఇక ఈ పాటలో బాలీవుడ్ స్టార్ నటి ఒకరు చిరుతో కలిసి నర్తించనున్నట్టు సమాచారం. అలాగే ఈ సాంగ్‌కి ప్రముఖ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్ గణేష్ ఆచార్య నృత్య రీతులను సమకూరుస్తుండటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో సెట్ కలర్ ఫుల్‌గా ఉంది. చూడబోతుంటే మెగాస్టార్ మరోసారి తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ని ఉర్రూతలూపబోతున్నట్టు తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న విశ్వంభర పురాణ గాధలను మోడరన్ సినిమాతో బ్లెండ్ చేస్తోంది. హై క్వాలిటీ VFX, భారీ CGI బడ్జెట్, అద్భుతమైన కథ ప్రేక్షకులకు విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోంది. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కె నాయుడు డీవోపీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























