పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు థియేటర్లలోకి వచ్చేసింది.ఈరోజు రిలీజ్ కావాల్సివుండగా నిన్న రాత్రి నుండే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు పడ్డాయి. వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.టికెట్ ధర కూడా ఎక్కువగా ఉండడంతో కేవలం ప్రీమియర్స్ తోనే భారీ వసూళ్లను రాబట్టుకుంది.కొన్ని చోట్ల ఆల్ టైం రికార్డు కలెక్షన్స్ సాధించింది.వీటితో కలుపుకొని తొలి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 60నుండి 70కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.దాంతో పవన్ కెరీర్ లోనే బిగెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా హరి హర వీరమల్లు రికార్డు సృష్టించనుంది.విజయ్ దేవరకొండ కింగ్డమ్ వచ్చే వరకు మరో సినిమా లేకపోవడంతో హరి హర వీరమల్లు రానున్న రోజుల్లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో క్రిష్ ,జ్యోతి కృష్ణ ఈసినిమాను తెరకెక్కించగా నిధి అగర్వాల్ బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు.మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మించారు.
ఇక ఈసినిమా తరువాత పవన్ నెక్స్ట్ ఓజీ తో రానున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.సుజీత్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా దానయ్య నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 25న విడుదలకానుంది.
ఇక ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈనెలతో పవన్ పాత్ర తాలూకు షూటింగ్ కంప్లీట్ కానుంది.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























