మచ్ అవైటెడ్ వార్ 2 ట్రైలర్ మరో రెండు రోజుల్లో విడుదలకానుందని తెలిసిందే. ఈసినిమానుండి టీజర్ తప్ప ఇంకేదీ బయటికి రాలేదు. విడుదలకు చాలా రోజుల సమయం వున్న ట్రైలర్ ను ముందుగానే విడుదలచేస్తున్నారు.ట్రైలర్ తో సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని చూస్తున్నారు.ఇక ఈ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టడ్ థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు.అంతేకాదు కుదిరితే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35 ఎమ్ ఎమ్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను జరుపాలని ప్లాన్ చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 పై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమాతో ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.తెలుగులో ఈసినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ విడుదలచేస్తున్నాడు.అందుకు గాను భారీ ధరకు ఈ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు. అయితే వార్ 2 విడుదలవుతున్న రోజే కూలీ కూడా వస్తుంది.డబ్బింగ్ సినిమానే అయినా నాగార్జున ఉండడం తో కూలీ పై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి. దాంతో వార్ 2కి బాక్సాఫీస్ వద్ద వార్ ఎదురుకానుంది.
బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈసినిమా ఆగస్టు 14న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























