పెద్ది కోసం రామ్ చరణ్ అదిరిపోయే మేకోవర్, నయా లుక్ వైరల్

Global Star Ram Charan's Stunning Makeover For Peddi Goes Viral

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పెద్ది’. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ సినిమా టైటిల్, మరో రెండు ఫస్ట్-లుక్ పోస్టర్స్ సహా ఫస్ట్ షాట్‌ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్‌ దేశవ్యాప్తంగా హ్యూజ్ బజ్ సృష్టించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రం కోసం హీరో రామ్ చరణ్ కంప్లీట్ బాడీ ట్రాన్సఫర్మేషన్ కావడం విశేషం. సినిమాలో క్యారక్టర్ ప్రకారం, మాస్ లుక్, పవర్‌ఫుల్ ప్రెజెన్స్ కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్, ఫిజిక్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన జిమ్‌లో ట్రైనింగ్ సెషన్‌లో ఉన్నారు. ఇందులో చరణ్ గుబురు గడ్డం, రఫ్ హెయిర్‌ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీతో కండలు తిరిగిన దేహంతో సూపర్ హీరో మాదిరి క‌నిపించారు. దీనిని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ,“Changeover for #PEDDI” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ నయా లుక్ చూసి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ‘అదిరిపోయింది అన్నా’ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక పెద్ది చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, సీనియర్ నటుడు జగపతి బాబు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.