హరిహర వీరమల్లు.. నైజాంలో గ్రాండ్ రిలీజ్ చేస్తోన్న ప్రముఖ సంస్థ

Hari Hara Veera Mallu Releasing in Nizam by Mythri Movie Distributors

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచనున్నారు. ఇప్పటివరకు రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక కీలక అప్‌డేట్ అందించింది చిత్ర యూనిట్. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని నైజాంలో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ప్రముఖ నిర్మాణ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ ఈ చిత్రం నైజాం ఏరియా హక్కులను అత్యధిక ధరకు చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనుంది. అత్యధిక స్క్రీన్స్ మరియు షోలతో పవర్ స్టార్ సినిమా ఈ గురువారం థియేటర్లు సందడి చేయబోతోంది.

క్రిష్ మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.