బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మొదటిసారి తల్లిదండ్రులయ్యారు. మంగళవారం (జూలై 15) కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల సభ్యులు చిట్టి పాపాయికి తమ కుటుంబంలోకి ఘనంగా స్వాగతం పలికారు. కాగా కియారాకు డాక్టర్స్ తొలుత ఆగస్టులో డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే, దాదాపు రెండు వారాలు ముందుగానే ఆమెకు ప్రసవం అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ముంబైలోని గిర్గాన్ ప్రాంతంలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో కియారాకు కాన్పు నిర్వహించారు. అనంతరం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో, పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్, కియారా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘కంగ్రాట్స్ .. న్యూ పేరంట్స్’ అంటూ పోస్ట్‌లు పెడుతూ అభినందనలు తెలియజేస్తున్నారు.
కాగా సిద్ధార్థ్, కియారా తొలిసారి ‘షేర్షా’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీ సమయం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇరుకుటుంబాల ఆమోదంతో రెండేళ్ల క్రితం 2023, ఫిబ్రవరి 7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది ఈ జంట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొదటిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























