సూపర్ స్టార్ రజినీకాంత్ – సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో వున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.తమిళ్ లోనే కాదు తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటికే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా తమిళ సినిమా గా రికార్డు కూలీ సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 600 కోట్లకుపైగా బిజినెస్ చేసింది.తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను రజినీకాంత్ చూసి ఏమన్నారో లోకేష్ తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.డబ్బింగ్ స్టూడియో లో రజినీకాంత్ గారు ఈసినిమా చూశారు. ఆ తరువాత ఆయన నన్ను హగ్ చేసుకొని కూలీ నాకు మరో తలపతి అని అన్నారు.ఆ మాట విని ఆరోజు రాత్రి మా ఇంటికెళ్లి చాలా నెలల తరువాత హ్యాపీ గా పడుకున్నాని లోకేష్ చెప్పుకొచ్చాడు.ఈసినిమా కోసం లోకేష్ రెండేళ్లు కష్టపడ్డాడుమరి విక్రమ్ ,లియోలతో వరసగా రెండు బ్లాక్ బస్టర్లు కొట్టిన లోకేష్,కూలీతో హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.
లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర , సత్య రాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కూలీ 1000 కోట్ల సినిమా కానుంది.అయితే కూలీకి తమిళనాడులో పెద్దగా పోటీ లేకపోవచ్చు కానీ తెలుగు,హిందీ లో మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆగస్టు 14 న కూలీ తోపాటు వార్ 2 కూడా విడుదలకానుంది. దాంతో ఈ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























