డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో జరుగుతుంది.దాదాపు నెలరోజులపైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది. ఈసాంగ్ ను రామ్ రచించాడు.ఫస్ట్ టైం రామ్ ఈసాంగ్ కోసం లిరిక్ రైటర్ గా మారాడు.ఈరొమాంటిక్ సాంగ్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడడంతో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.ఈనెల 18న ఈపాటను రిలీజ్ చేయనున్నారు.మరి రామ్ నుండి వస్తున్న ఈ ఫస్ట్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ ఫ్యాన్ బయోపిక్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు తెరకెక్కిస్తున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇందులో ఉపేంద్రకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఈసినిమాపై రామ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. రామ్ కు సరైన హిట్ పడి చాలా ఏళ్ళు దాటిపోయింది. దాంతో ఈసారి ఆంధ్ర కింగ్ తాలూకుతో రామ్ కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా కూడా బాగా వస్తుందని టాక్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























