హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా రిలీజ్ అయి అయిదో రోజు ఇది. తమిళ్, తెలుగులో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఇంకా అద్భుతంగా పిక్ అప్ అవుతుంది. సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌కి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది.” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తెలుగు నుంచి చాలా అద్భుతమైన మెసేజ్‌లు వస్తున్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సిద్ధార్థతో నాకు చాలా స్పెషల్ బాండింగ్ ఉంది. మేము భవిష్యత్తులో కలిసి ఇంకెన్నో సినిమాలు చేయాలనుకుంటున్నాము. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























