ఈఏడాది స్టార్టింగ్ లో తండేల్ తో వచ్చి ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ప్రస్తుతం నాగ చైతన్య తన 24 వ సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.మిస్టరీ థ్రిల్లర్ గా రానుంది. నాగ చైతన్య ఈ జోనర్ లో నటించడం ఇదే మొదటిసారి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా ఈరోజు నుండి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈషూట్ జరుగుతుంది.దాదాపు 30రోజుల పాటు జరుగనున్న ఈషెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈసినిమా లో నాగ చైతన్య స్టైలిస్ట్ లుక్ లో కనిపించనుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో తను దక్ష అనే పాత్రలో ఆర్కియాలజిస్ట్ గా కనిపించనుంది.
ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ విఎఫ్ఎక్స్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చైతన్య కెరీర్ కు ఈసినిమా టర్నింగ్ పాయింట్ కానుంది. త్వరలోనే టైటిల్ చెప్పనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: