టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ‘యూవీ క్రియేషన్స్’ ఒకటి. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హోం బ్యానర్‌గా ముద్ర పడిన ఈ సంస్థలో ఆయన అన్న ప్రమోద్ కూడా ఒక నిర్మాత కాగా, మిగిలిన వారు ప్రభాస్ స్నేహితులే. దాదాపు పుష్కర కాలం క్రితం ప్రభాస్ ఫ్రెండ్స్ వంశీ, విక్కీతో కలిసి అన్న ప్రమోద్ ఈ నిర్మాణ సంస్థ మొదలు పెట్టారు. ఈ 12 ఏళ్లలో వాళ్ళు ఈ బ్యానర్‌పై ఎన్నో సినిమాలు నిర్మించారు. ప్రభాస్‌తో ‘మిర్చి, సాహో, రాధేశ్యామ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే ఇతర హీరోలతో ‘మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, ఎక్స్‌ప్రెస్ రాజా, భాగమతి’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించింది. మరోవైపు ‘యూవీ కాన్సెప్ట్స్’ పేరుతో మరో బ్యానర్ కూడా ప్రారంభించి కంటెంట్ బేస్డ్ సినిమాలను కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
“గుర్తు తెలియని వ్యక్తి మా కంపెనీ ప్రతినిథి అని చెప్పుకుంటూ నటీమణులని వారి ప్రతినిధులని కలిసి ఫ్రాడ్ ఆఫర్స్ ఇస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే చెప్పదలచుకున్నాం. సదురు వ్యక్తికి మా యూవీ క్రియేషన్స్ సంస్థకి ఎలాంటి సంబంధం లేదు. మేము ఎలాంటి అధికారిక సమాచారం అయిన లేదంటే కాస్టింగ్ సంబంధిత ప్రక్రియ అయిన కూడా కచ్చితంగా అధికారికరంగానే రివీల్ చేస్తాం” అని తెలిపారు.
“తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా ఎంగేజ్ అయ్యే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. మా సంస్థకి నటీమణులు అవసరం అయితే ఇండస్ట్రీ సోర్సెస్ ద్వారా మాత్రమే షేర్ చేస్తాం. అలానే మా పేరు బ్రాండ్ మిస్ యూజ్ చేస్తున్న ఇలాంటి ఘటనలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం” అని అందులో పేర్కొంది యూవీ టీమ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































