రివ్యూ : 3 BHK

3 BHK review in telugu

నటీనటులు : సిద్దార్థ్ , శరత్ కుమార్ , దేవయాని , మీథా రఘునాథ్
ఎడిటింగ్ : జితేష్ స్టానిస్లాస్
సినిమాటోగ్రఫీ :దినేష్ కృష్ణన్
సంగీతం :అమ్రిత్ రామ్ నాథ్
దర్శకత్వం : శ్రీ గణేష్
నిర్మాత : అరుణ్ విశ్వ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సిద్దార్థ్ , శరత్ కుమార్ , దేవయాని గుడ్ నైట్ ఫేమ్ మీథా రఘునాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 3BHK.ఈసినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ మైత్రి మూవీ మేకర్స్ తీసుకోవడం తో అంచనాలు ఏర్పడ్డాయి. మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ 3 BHK ఈరోజే థియేటర్లలోకి వచ్చింది .మరి ఈసినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

వాసుదేవ్ (శరత్ కుమార్ ), శాంతి (దేవయాని) దంపతలకు ఎప్పటినుండో 3 BHK ప్లాట్ కొనుక్కోవడం కల. అయితే కుమారుడు ప్రభు ( సిద్దార్థ్) కుమార్తె ఆర్తి ( మీథా రంగనాథ్) భవిష్యత్ కోసం ప్లాట్ కొనడం వాయిదా పడుతూ వస్తుంది.ఈ క్రమంలో ప్రభు కొంత కాలం తండ్రి వాసు దేవ్ తో మాట్లాడం మానేస్తాడు. ఇదిలావుండగా ప్రభు, ఐశ్వర్య (చైత్ర జె ఆచార్) తో ప్రేమలోపడతాడు.మరి వీరిద్దరికి వివాహం జరిగిందా?అసలు ప్రభు , వాసుదేవ్ తో ఎందుకు మాట్లాడడు?ఇంతకీ వాసు దేవ్ ఫ్యామిలీ 3 BHK కొన్నారా లేదా అనేది మిగితా కథ.

విశ్లేషణ :

సొంతంగా ఓ ఇల్లు ఉండాలన్నది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కల. దీన్నే కథ గా మార్చి 3BHK తీశాడు దర్శకుడు శ్రీ గణేష్. దాన్ని నెరవేర్చుకొనే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు ఈసినిమాలో చూపించి ఫ్యామిలీస్ కి కనెక్ట్ చేసేలా తీశాడు.సినిమా కొంచెం స్లో అనిపించినా చాలా వరకు ఎంగేజ్ చేస్తూ ఓ మంచి సినిమా చూశాం అనే ఫీల్ తెప్పిస్తుంది. కథలోకి వెళ్ళడానికి పెద్దగా టైం తీసుకోలేదు. సిద్దార్థ్ ఇందులో డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించాడు ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని క్రియేట్ చేస్తాయి.ఇక సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగే ఎంగేజ్ చేస్తూ బాగుందనిపించుకుంది.ముఖ్యంగా క్లైమాక్స్ ను బాగా డీల్ చేశాడు దర్శకుడు. ఇందులో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి బాగా కనెక్ట్ అవుతాయి.

నటీనటుల విషయానికి వస్తే సిద్దార్ట్ , శరత్ కుమార్ లు సినిమాకు ప్రాణం పోశారు. వీరిద్దరి తమ పాత్రల్లో అదరగొట్టారు. మిడిల్ క్లాస్ తండ్రి గా శరత్ కుమార్ , కొడుకుగా సిద్దార్థ్ ల నటన సినిమాను నిలబెట్టాయి. సీనియర్ నటి దేవయానికి మంచి రోల్ దొరికింది. ఇందులో తన నటన చాలా సహజంగా అనిపించింది.ఇక మిథా రంగనాథ్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా బాగా చేసింది. చైత్ర జె ఆచార్ కనిపించింది తక్కువ సేపే అయినా ఉన్నంతలో మెప్పించింది. ఓవరాల్ కాస్టింగ్ సినిమాకు చాలా సపోర్ట్ ఇచ్చింది.

టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది. సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ పెద్దగా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు.మంచి ఫీల్ వున్న బీజీఎమ్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. నిర్మాణ విలువలు స్టోరీ కి తగ్గట్లు వున్నాయి.

ఓవరాల్ గా ప్రతి మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన ఈ 3BHK ఆకట్టుకుందని చెప్పొచ్చు. సిద్దార్థ్ , శరత్ కుమార్ ల నటన ,సంగీతం సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈసినిమా బాగా నచ్చుతుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.