టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో, ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా కొత్త సినిమా మొదలైంది. ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుండటం గమనార్హం. మానస శర్మ అనే యంగ్ అండ్ ట్యాలెంటెడ్ రైటర్ కం డైరెక్టర్ ఈ మూవీకి సారథ్యం వహిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో ఇది వారికి రెండో సినిమా. అంతకుముందు ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే చిత్రం ఫస్ట్ ప్రాజెక్ట్. అది సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్‌తో తమ తరువాతి ప్రాజెక్టుని ప్రకటించడంతో, దీనిపై ఇప్పటినుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక త్వరలోనే ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటుల వివరాలు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: