హరిహర వీరమల్లు ట్రైలర్ విశేషాలు

Hari Hara Veera Mallu Trailer Raising Expectations With Interesting Elements

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసిన మేకర్స్.. రేపు ఉదయం 11:10 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. దీనికోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

హరిహర వీరమల్లు ట్రైలర్‌లో పలు ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. అవేంటంటే.. ఈ ట్రైలర్‌కి అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడట. ఆయన గాత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాగే ట్రైలర్ నిడివి 3 నిముషాలు కలిగివుందట. మొత్తం 140 షాట్స్ ఉన్నాయట. ఇవి ఒకదానిని మించి మరొకటి అన్నట్టుగా ఉన్నాయని యూనిట్ వర్గాల టాక్. ముఖ్యంగా విజువల్స్ అయితే ఐ ఫీస్ట్ లాగా ఉంటాయట. చూస్తుంటే, వీరమల్లు ట్రైలర్ ప్యూర్ సినిమాటిక్ అడ్రినలిన్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

ఇదిలావుంటే మరోవైపు హరిహర వీరమల్లు ట్రైలర్‌పై రీసెంట్‌గా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్ ఈ అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. ఇక రేపు హైదరాబాద్ లోని ప్రముఖ విమల్ థియేటర్‌లో ప్రత్యేకంగా వీరమల్లు ట్రైలర్‌ రిలీజ్ కార్యక్రమం జరగనుండగా.. దీనిలో చిత్ర నిర్మాతలు ఏఎం రత్నం, దయాకర్ రావు, డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ తదితరులు పాల్గొననున్నారు.

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించగా.. మనోజ్ పరమహంస కెమెరా, తోట తరణి ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.