రాబిన్ హుడ్ తరువాత హీరో నితిన్ నెక్స్ట్ తమ్ముడుతో రానున్నాడు.వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది.సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈరోజు రిలీజ్ ట్రైలర్ ను కూడా వదిలారు.ఇందుకోసం జెఆర్సీ కన్వెన్షన్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ట్రైలర్ టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్ అనిపించింది.విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి.ఓవరాల్ గా ఈ రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.ట్రైలర్ చూస్తే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనేలా వుంది.ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాలో లయ,సప్తమి గౌడ , వర్ష బొల్లమ్మ , దిత్య కీలక పాత్రల్లో నటించగా అజినీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.సోలోగా విడుదలకానుండడం అడ్వాంటేజ్ కానుంది.
ఇక వరస పరాజయాలతో కొనసాగుతున్న నితిన్ కి తమ్ముడు సక్సెస్ కీలకం కానుంది.నితిన్ కూడా ఈసినిమాపై కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఇదిలావుంటే నితిన్ నెక్స్ట్ బలగం ఫేమ్ వేణు ఎల్దండి డైరెక్షన్ లో ఎల్లమ్మ లో నటించనున్నాడు.ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.దిల్ రాజే ఈసినిమాను కూడా నిర్మించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























