కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ ఫిల్మ్ ’కూలీ’. నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్, సత్య రాజ్ మలయాళ నటుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ముఖ్యంగా రజినీ బర్త్ డే సందర్భంగా ‘చికిటు వైబ్’ పేరుతో విడుదలచేసిన స్పెషల్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రీసెంట్‌గా కూలీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలచేసి మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేసింది.
సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. రూ. 1000 కోట్లు వసూలు టార్గెట్‌గా బరిలోకి దిగుతోంది. లోకేష్ కనగరాజ్ చేసిన చివరి రెండు చిత్రాలు ‘విక్రమ్, లియో’ తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ఇక్కడ కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. కూలీ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను ప్రముఖ దిష్ట్రుబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది. ఆగస్టు 14న కూలీ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే హిందీలో ‘మజాదూర్’ అనే టైటిల్‌తో రాబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: