కింగ్‌డమ్‌ నుంచి త్వరలో అదిరిపోయే అప్‌డేట్స్ – నాగవంశీ

Producer Naga Vamsi Gives Updates on Kingdom Release Date, Teaser and Songs

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘కింగ్‌డమ్‌’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కొద్దిరోజులక్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలావుంటే ఈ సినిమా నుంచి త్వరలో అదిరిపోయే అప్‌డేట్స్ రానున్నాయి. ఈ మేరకు చిత్ర నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో.. “ఏం పోస్ట్ చేసినా, కింగ్‌డమ్‌ గురించి తీయటి శాపాలు మాత్రం వస్తూనే ఉంటాయి అని తెలుసు. అయితే నన్ను నమ్మండి. మా టీమ్ మీకు భారీ స్క్రీన్ అనుభవాన్ని అందించడానికి 24 గంటలూ పని చేస్తోంది.. నేను మీకు ఒక విషయం వాగ్దానం చేయగలను. ఈ చిత్రం అందించే అడ్రినలిన్ రష్ అవాస్తవం.” అని తెలిపారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “మరి మీకందరికీ నేనేంటో తెలుసు. నేను ఏదయినా ఎంతో నమ్మితే కానీ చెప్పను. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా మీ క్రియేటివిటీ అంతా నా మీద చూపిస్తారు.. కానీ నేను మీకు గట్టిగా చెప్పగలను.. ఈ సినిమా చూసిన తర్వాత.. కింగ్‌డమ్‌ నిజమైన విన్నర్ అని రాస్తారు. ఇది గౌతమ్ శైలిలో నాటకీయతతో నిండిన పూర్తి మీల్స్ కమర్షియల్ ఎంటర్‌టైనర్!! త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్, టీజర్ మరియు సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం!!!” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.