“కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్‌ని లాంచ్ చేస్తున్నాం’ అని అన్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన నేతృత్వంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్ లాంచ్ ఈవెంట్ తాజాగా గ్రాండ్‌గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. విజయ్, దేవి థాంక్యూ. ‘ఆర్య’ నుంచి దేవితో నాకు జర్నీ ఉంది. ఒక సక్సెస్‌ఫుల్ ఆల్బమ్ చేయడానికి దేవి ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అలాగే విజయ్ దేవరకొండ ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా జర్నీ మొదలుపెట్టి ఈరోజు ఒక కింగ్‌డమ్ క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ‘దిల్’ సినిమా తర్వాత ఎంతోమంది కొత్త దర్శకుల్ని లాంచ్ చేసాం.”
“వాళ్ళు ఈరోజు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌గా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో 57 సినిమాలు పూర్తయ్యాయి. నేను, శిరీష్ కథ విని బాగుందన్న తర్వాతనే స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్‌కి వెళుతుంది. అలానే 57 సినిమాలు పూర్తి చేశాం. హర్షిత్, హన్సిత ‘దిల్ రాజు ప్రొడక్షన్’ బ్యానర్ పెట్టి ‘బలగం’ వేణుతో పాటు నలుగురు కొత్త దర్శకుల్ని పరిచయం చేశారు.”
“వాళ్లు కూడా కొత్త దర్శకులతో అన్ని రకాల సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త దర్శకులు కొత్త నిర్మాతలు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచన ఈ దిల్ రాజు డ్రీమ్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద భారీ సినిమాలు తీస్తున్నాం. దిల్ రాజ్ ప్రొడక్షన్‌పై కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నారు.”
“కొత్త టాలెంట్ కోసం ఒక కొత్త టీంని ఏర్పాటు చేసినప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దిల్ రాజు డ్రీమ్స్ సంస్థని ఒక యంగ్ జనరేషన్ టీంతో ఫామ్ చేసాము. చాలామంది నిర్మాతలుగా రావాలనుకుంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గాని సినిమాని ఎలా మొదల పెట్టాలి? ఎలా కంప్లీట్ చేయాలి? అని క్లారిటీ ఉండదు. కొంతమంది సినిమా తీశాము వీడియో చూడండి అని చూపిస్తుంటారు.”
“సినిమా తీయడం ముఖ్యం కాదు సినిమాని తీసి ప్రేక్షకులు దగ్గరికి తీసుకెళ్లడం పెద్ద టాస్క్, అందరికీ సినిమాల్లోకి రావాలని పాషన్ వుంది. కానీ రైట్ ఫ్లాట్‌ఫామ్ వాళ్లకి దొరకదు. అలాంటి రైట్ ఫ్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేయడానికి దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్ చేస్తున్నాం. దాదాపు 2000 మంది ఈవెంట్‌కి వచ్చారంటే మీలో ఎంతమందికి సినిమా పైన పాషన్ ఉందో అర్థం అవుతుంది. మేము ఇక్కడికి రావడానికి 30 ఏళ్లు పట్టింది. కానీ సినిమాలోకి రావడం, ఇక్కడ రాణించడం అంత ఈజీ కాదు.”
“వందమంది దర్శకులు కావాలని ప్రయత్నిస్తే అందులో ఐదు మందికి ఛాన్స్ వస్తుంది.ఒకరు హిట్ సినిమా తీస్తారు. అంటే ఇక్కడ సక్సెస్ అనేది 1%. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా కోసం మీరు చేస్తున్న వర్క్ ని విడిచిపెట్టకండి. మేము కూడా అలానే చేసాము. సినిమాలో సక్సెస్ అయ్యేవరకు మేము చేస్తున్న ఆటోమొబైల్స్ బిజినెస్‌ని వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయితే మళ్లీ వెనక్కి వెళ్లి పనిచే బిజినెస్ చేసుకోవాలి. సినిమా వల్ల మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు.”
“మేము కూడా ఇక్కడ స్ట్రగుల్స్ పడ్డాం. అయితే వదలకుండా ప్రయత్నించాం, సాధించాం. నిజానికి సినిమా ఇండస్ట్రీలో మనం రాణించగలుగుతామా లేదా అనేది మీకే తెలియాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. సినిమా అనేది ఒక అట్రాక్షన్. అది లాగుతుంటుంది. జీవితాలు మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎప్పుడైతే మీరు సినిమాలో సక్సెస్ అవుతున్నారని మీకు అర్థం అవుతుందో అప్పుడు మీరు 24 గంటలు కష్టపడాలి.”
“మేము, విజయ్, దేవి, నాని ఇలా అందరూ ఇండిపెండెంట్‌గా సక్సెస్ అయి వచ్చిన వాళ్ళమే. అంతకుముందు జనరేషన్‌లో చిరంజీవి గారు, రజనీకాంత్ గారు అందరూ కూడా ఇండిపెండెంట్ గానే సక్సెస్ సాధించారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా అంటేనే హార్డ్ వర్క్. దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా మేము ఒక ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. దీనికి మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. దానిలో టీమ్ స్క్రూటినీ చేసి మెజారిటీ పీపుల్ లైక్ చేసిన తర్వాత మా దగ్గర పంపిస్తారు.”
“మేము టైం స్పెండ్ చేసి దాన్ని ఓకే చేస్తాము. కానీ చాలామంది రిజెక్ట్ అవ్వచ్చు. అంతమాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. మీలో కాన్ఫిడెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. దిల్ రాజు డ్రీమ్స్‌లో ఒక ప్రొడ్యూసర్ కాలమ్ కూడా పెడుతున్నాం. సినిమా గురించి మా టీం అనాలిసిస్ చేసి చెప్తారు.”
“అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా మోసాలు ఉంటాయి. అన్నిటి మీద అవగాహనతో ముందుకు రావాలి. ఈవెంట్‌కి రావడానికి పదివేల రిజిస్ట్రేషన్ వచ్చాయి. వరల్డ్ వైడ్‌గా లక్ష నుంచి రెండు లక్షల మంది సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థం అవుతుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























