బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న సినిమా తమ్ముడు. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు.జూలై 4న ఈసినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. అయితే ఈసినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. దీని గురించి శ్రీరామ్ వేణు స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమ్ముడు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం.సెన్సార్ వాళ్లు కొన్ని కట్స్ చెప్పారు. మేము ఆ కట్స్ వద్దు అనుకున్నాం.ఒప్పుకుంటే యు /ఎ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్లు. సినిమాలోని ఎస్సెన్స్ ను సరిగ్గా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలనే కట్స్ లేకుండా ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం.ఇది మా అందరి ఉమ్మడి నిర్ణయం.దిల్ రాజు గారు ఒక్కరే ఈ డెసిషన్ తీసుకోలేదు. సినిమాలో అంతగా హింస లేదు. కొత్తగా వచ్చిన సెన్సార్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్ గా ఉన్నారు.వాళ్లనూ తప్పు పట్టలేం.వారి గైడ్ లైన్స్ ప్రకారం వర్క్ చేస్తుంటారు.
ఇందులో హీరోతో పాటు ఐదుగురు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, దిత్య ముఖ్యమైన పాత్రలు చేశారు. హీరో అంటే ఇంత లెంగ్త్ ఉండాలి అనేది తమ్ముడులో ఉండదు. హీరోతో పాటు ఐదుగురు వుమెన్ క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి. విక్రమ్ లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కథలో ఎలా ట్రావెల్ అవుతుందో అలా మా మూవీలోనూ ఉంటుంది.
తమ్ముడు కథ విని దిల్ రాజు గారు బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అంతకుముందు మా కాంబోలో ఐకాన్ మూవీ కోసం వర్క్స్ చేసుకున్నాం.ఆ తర్వాత ఈ మూవీ స్టార్ట్ చేశాం. ఈ కథకు సెట్ అయ్యే హీరో కోసం సెర్చ్ జరిగింది. నితిన్ బాగుంటాడని తీసుకున్నాం.ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ స్ఫూరితో తమ్ముడుకథను సిద్ధం చేసుకున్నా.కథ ప్రకారమే తమ్ముడు టైటిల్ పెట్టాం అని వేణు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




–
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: