బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సితారే జమీన్ పర్’. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పటి నుండి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూనే ఉంది. ఈ మూవీపై దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ జాబితాలో చేరారు. సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను సమీక్షించి, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌కు హృదయపూర్వకమైన సందేశాన్ని పంపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు మహేష్ బాబు ఎక్స్ వేదికగా ఈ సినిమా గురించి.. “సితారే జమీన్ పర్.. చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది. అది మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది మరియు చప్పట్లు కొట్టేలా చేస్తుంది!! అమీర్ ఖాన్ యొక్క అన్ని క్లాసిక్‌ల మాదిరిగానే. చివరిగా ఈ సినిమా చూసి మీరు మీ ముఖంలో పెద్ద చిరునవ్వుతో థియటర్ నుంచి బయటకు వెళతారు” అని పేర్కొన్నారు. ఇక మహేష్ ఈ పోస్ట్‌ను, ఈ సినిమాలో కథానాయికగా నటించిన జెనీలియా డిసౌజా, దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న మరియు ఇతరులతో సహా సినిమా స్టార్ తారాగణాన్ని కూడా ట్యాగ్ చేశాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: