శేఖర్ కమ్ముల కుబేర బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.ధనుష్ , నాగార్జున ,రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమాను సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ నిర్మించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఇక ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుండడంతో ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ నిన్న సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు.దీనికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.చిరు గారు నా జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు.థాంక్ యు సర్. ఈ సినిమా కథ విన్న తర్వాత సెట్స్ వెళ్లి డైరెక్టర్ గారికి సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను.ఆయన ఎలా చెబితే అలా పెర్ఫార్మ్ చేయాలని నిర్ణయించుకున్నాను.ఈ రోజు సమీర పాత్రకు వచ్చిన క్రెడిట్ డైరెక్టర్ గారికే దక్కుతుంది. ఇలాంటి క్యారెక్టర్ రావడం నా అదృష్టం.ధనుష్ గారు నాగార్జున గారు శేఖర్ గారు ఈ సినిమాకి పిల్లర్స్. దేవిగారు మ్యూజిక్ తో మరో లెవల్ కి తీసుకెళ్ళారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలని అన్నారు.
ప్రొడ్యూసర్ జాహ్నవి నారంగ్ మాట్లాడుతూ…ముందుగా మా తాత గారిని స్మరించుకుంటున్నాను.ఈ ప్రాజెక్టు ఆయన ఆశీస్సులతో మొదలైంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకి విచ్చేసిన చిరంజీవి గారికి థాంక్యూ.కుబేర మెగా బ్లాక్ బస్టర్ అయిందని భావిస్తున్నాను. చిరంజీవి గారు మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి ముందుంటారు. శేఖర్ గారితో వర్క్ చేయడం ఒక స్కూల్ కి వెళ్ళినట్టే ఉంటుంది.దేవి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రశ్మిక గారు సమీర పాత్రలో ఒదిగిపోయారు.దీపక్ పాత్రలో నాగార్జున గారు పెర్ఫార్మెన్స్ మాస్టర్ క్లాస్. దేవా పాత్రలో ధనుష్ గారు అద్భుతంగా నటించారు.ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: