కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో జూన్ 20న కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే మార్నింగ్ షో నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఆదివారం బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరుగగా.. సినిమా యూనిట్ అంతా హాజరై సందడి చేసింది..
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. చిరు ఏమన్నారంటే.. “ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్‌కి ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు. అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్‌గా క్యారెక్టర్లో ఇమిడిపోయారు.” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం. కంటెంట్ బాగుంటే హ్యూమన్ ఎమోషన్స్‌ని టచ్ చేయగలిగితే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారని కుబేర సినిమా నిరూపించింది. టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. లవ్ యు ఆల్” అని అన్నారు.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గురించి చెబుతూ.. “దేవి నా బిడ్డ లాంటివాడు. నా కం బ్యాక్‌లో కూడా అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. తన ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది. దేశం మొత్తం తనని కీర్తిస్తోంది. సినిమా చాలా మ్యూజికల్‌గా ఉంది. అది దేవిశ్రీ రికార్డింగ్‌లో అద్భుతం చేశాడు. ఇందులో తల్లి మీద పాడిన పాట ఖైదీ 150లో ‘నీరు నీరు’ పాటని మైమరిపించే లాగా అనిపించింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























