విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడింది నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే కన్నప్ప నుండి క్యారెక్టర్ రివీల్ పోస్టర్స్, నాలుగు పాటలు, టీజర్ సహా ట్రైలర్ రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. జూన్ 21న (ఈ శనివారం) హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకను గ్రాండ్‌గా చేయనున్నట్టు తెలిపింది. కాగా ఈ ఈవెంట్‌కి ప్రభాస్ హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
కాగా కన్నప్ప చిత్రంలో ప్రీతి ముఖుంధన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వీరితోపాటుగా విష్ణు మంచు కుమార్తెలు, కుమారుడు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు పేరొందిన డిష్ట్రిబ్యూషన్ సంస్థలు ముందుకొస్తున్నాయి. కేరళలో ఈ సినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుండగా.. తమిళంలో టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శక్తి ఫిలిం ఫ్యాక్టరీ రిలీజ్ చేయనుంది. తెలుగులో కూడా బడా సంస్థలే రిలీజ్ చేయనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: