మచ్ అవైటెడ్ కన్నప్ప వచ్చే వారంలో థియేటర్లలోకి రానుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా రెండు రోజుల క్రితం ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ సినిమాకు వున్న హైప్ ను పెంచేసింది.స్టార్ కాస్టింగ్ కి తోడు క్వాలిటీ మేకింగ్ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమాను రిలీజ్ కు ముందుగానే సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీ తో కలిసి వీక్షించారు.అనంతరం మోహన్ బాబు ,విష్ణులను అభినందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న రాత్రి రజినీ కోసం కన్నప్ప స్పెషల్ స్క్రీనింగ్ ను వేశారు. రజినీ సినిమా చూసి కన్నప్ప టీంను అభినందించారు.ఈ విషయాన్ని మంచు విష్ణు ఎక్స్ ద్వారా వెల్లడించాడు.రాత్రి రజినీకాంత్ అంకుల్ కన్నప్ప చూశారు.సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఆతరువాత నన్ను గట్టిగా హగ్ చేసుకున్నారు.ఒక నటుడి గా ఈ క్షణం కోసం 22 ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్నాని విష్ణు ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇక పాన్ ఇండియా సినిమా కావడంతో కన్నప్పను అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా రేపు రాజస్థాన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
శివుడు భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ ఈసినిమాను తెరకెక్కించగా మంచు విష్ణు ,మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.ఈనెల 27న ఈసినిమా థియేటర్లోకి రానుంది.హిట్ టాక్ వస్తే కన్నప్ప భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























