కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరై ‘కుబేర’ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి కుబేర సినిమా కంటెంట్ మరియు దర్శకుడు శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. కుబేర నాకు గొప్ప ఆపర్చ్యూనిటీ. నాకు శేఖర్ గారితో వర్క్ చేయాలని వుండేది. ఆ అవకాశం ఈ సినిమాతో దొరికింది. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను. సినిమా కోసం అందరం చాలా హార్డ్ వర్క్ చేసాము. టీమందరికీ థాంక్యూ.”
“నాగార్జున గారితో రెండోసారి కలిసి పని చేసే అవకాశం దొరికింది. ఆయన వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ధనుష్ గారితో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మా కెమిస్ట్రీ చూసి మరి కొంత మంది దర్శకులు రచయితలు కొత్త సినిమాలు ఆఫర్ చేస్తారని నమ్ముతున్నాను. ఆయనతో మరోసారి కలిసి పని చేయాలని ఎదురుచూ స్తున్నాను. నిర్మాతలు చాలా బడ్జెట్ పెట్టి అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఈ సిమమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: