రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో సుహాస్. అందులో భాగంగా సుహాస్ నటించనున్న నెక్స్ట్ మూవీ ఈరోజు అఫీషియల్ గా లాంఛ్ చేశారు.డెబ్యు డైరెక్టర్ గోపి అచ్చర ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా శివాని నగరం హీరోయిన్ గా నటిస్తుంది.సుహాస్ , శివాని ఇద్దరు కలిసి నటించడం ఇది రెండో సారి.ఇంతకుముందు అంబాజీ పేట మ్యారేజ్ బ్యూరో లో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు జంటగా మరో సినిమా చేస్తున్నారు.త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా బి నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. రైటర్ పద్మభూషణ్ తో ప్రశంసలు అందుకున్న షణ్ముక ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందించారు.
ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో సత్యదేవ్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.ముహూర్తం షాట్ కు సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు.వంశీ నందిపాటి ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు.ఈసినిమాలో నరేష్,సుదర్శన్, అన్నపూర్ణమ్మ ముఖ్యమైన పాత్రల్లో నటించనుండగా ఈ నెలలో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























