గత ఏడాది ప్రేమలుతో 100 కోట్లక్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించాడు మలయాళ యంగ్ హీరో నస్లేన్.ఈసినిమా తెలుగు కూడా విడుదలై 10కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ప్రేమలు తరువాత నస్లేన్ హీరోగా నటించిన సినిమా అలపుజ్జ జింఖానా.ఈఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా మలయాళంలో 60 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు అక్కడ ఈఏడాది థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో జింఖానా గా విడుదలై అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఈరోజు ఓటిటి లోకి వచ్చేసింది.సోనీ లివ్ ఈసినిమాను మలయాళంతోపాటు మిగితా భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఖలీద్ రెహమాన్ ఈసినిమాను తెరకెక్కించగా విష్ణు విజయ్ సంగీతం అందించాడు.ఖలీద్ రెహమాన్ ,జోబిన్ జార్జ్ నిర్మించారు.
ఇక నస్లేన్ ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.సూపర్ హీరో కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: