సూర్య 45 టైటిల్ టీజర్ రానుంది

suriya 45 title teaser out soon

రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ తన 45వ సినిమాతో రానున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు సూర్య.ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.ఇక ఇప్పటివరకు ఈసినిమా నుండి పెద్దగా అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు.అయితే వచ్చే వారంలో ఓ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ వుంది.అందులో భాగంగా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాకు వెట్టై కరుప్పు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా ప్రచారంలో వుంది.మరి ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేదో మరి కొద్దీ రోజుల్లో క్లారిటీ రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో స్వాసికా ,కాళీ వెంకట్ ,నటరాజన్ కీలకపాత్రల్లో నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈ దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక రీసెంట్ గా వచ్చిన రెట్రో కూడా తనకు కావాల్సిన విజయాన్ని ఇవ్వలేకపోవడంతో ఈ 45వ ఈసినిమాతో సూర్య కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.

ఇదిలావుంటే సూర్య ప్రస్తుతం తన 46వ సినిమాలో నటిస్తున్నాడు.మూడు రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు సూర్య. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రేమలు బ్యూటీ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది.నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.చాలా గ్యాప్ తరువాత సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.ఇక సార్ ,లక్కీ భాస్కర్ లతో వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టి పీక్ ఫామ్ లో వున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి నుండి వస్తున్న సినిమా కావడంతో సూర్య 46 పై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.