వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో హీరో నితిన్ నటించిన సినిమా తమ్ముడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.వచ్చే నెల 4న థియేటర్లలోకి రానుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్నఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సాంగ్స్ ,టీజర్ లాంటి ఏమి లేకుండా డైరెక్ట్ గా ట్రైలర్ నే వదిలారు. ఇక ఈ ట్రైలర్ కు యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.ట్రైలర్ వచ్చే ముందు వరకు ఈ సినిమాకు సరైన బజ్ లేదు కానీ ఇప్పుడు మంచి హైప్ వస్తుంది. యూ ట్యూబ్ లో ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుని రెండవ స్థానంలో ట్రెండింగ్ కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్రదర్ -సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈసినిమాలో నితిన్ అక్కగా ప్రముఖ నటి లయ నటిస్తుంది.చాలా గ్యాప్ తరువాత లయ ఈసినిమా తో రీ ఎంట్రీ ఇస్తుంది.ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తుండగా వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో కనిపించనుంది.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక రీసెంట్ గా నితిన్ రాబిన్ హుడ్ తో రాగా ఈసినిమా కూడా తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది.దాంతో తమ్ముడుతో నైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు ఈహీరో.ఇదిలావుంటే ఈసినిమా తరువాత నితిన్ ఎల్లమ్మలో నటించనున్నాడు.బలగం ఫేమ్ వేణు ఎల్దండి ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా దిల్ రాజు నిర్మించనున్నారు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: