మంచు విష్ణు కన్నప్ప మరో 16 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.ఇక ఈనెల 13న ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ రానుంది.ఈ ట్రైలర్ రిలీజైయ్యాక సినిమాపై అంచనాలు డబుల్ అవ్వడం ఖాయం.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరుగుతుంది.ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంటున్నారు.అందులో భాగంగా కేరళలో ఈసినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.ఇక తమిళం లో టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయినా శక్తి ఫిలిం ఫ్యాక్టరీ కన్నప్ప ను అక్కడ రిలీజ్ చేయనుంది. దాంతో కన్నప్ప తమిళనాడులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు లో కూడా బడా డిస్ట్రిబ్యూటర్లు థియేట్రికల్ హక్కులు దక్కించుకున్నారు.ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో మంచు విష్ణు ,మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్,శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.ఇందులో ప్రభాస్ పాత్ర ఎలావుండనుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కన్నప్పలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల సేపు కనిపించనున్నాడట. హిట్ టాక్ వస్తే ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.ఈసినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























