మచ్ అవైటెడ్ కన్నప్ప మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా ఈరోజు సాయంత్రం గుంటూరులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా వస్తున్న ఈసినిమాలో విష్ణు తోపాటు మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.దాంతో కన్నప్పపై అంచనాలు భారీగా వున్నాయి.ముకేష్ కుమార్ సింగ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా భారీ బడ్జెట్ తో మంచు విష్ణు నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా మంచు విష్ణు మై కన్నప్ప స్టోరీ అనే వీడియోను రిలీజ్ చేశారు.ఇక మోహన్ బాబు కూడా తన లైఫ్ లో కన్నప్ప ఎవరో వీడియో ద్వారా చెప్పారు.
ఓ అమాయకుడు,ఆటవికుడైన తిన్నడు,ఆ పరమేశ్వరునికి తన కళ్లు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయారు.మన ఆకలి తెలుసుకున్న అమ్మ అడగకుండానే అన్నం పెడుతుంది.మనకు ఏది కావాలనుకుంటే అది వారికి శక్తికి మించి ఉన్నా కూడా మన అమ్మానాన్నలు అందిస్తారు.నా దృష్టిలో మా అమ్మానాన్నలు నాకు కన్నప్పలు.మా అమ్మ పేరు లక్ష్మమ్మ.దురదృష్టవశాత్తు పుట్టుక నుంచే ఆమెకు రెండు చెవులూ వినిపించేవి కావు.ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదుగురు సంతానాన్ని ప్రసాదించాడు.బస్సు దిగి మా ఊరుకు వెళ్లాలంటే ఏడు కిలోమీటర్లు నడవాల్సిఉండేది.చిన్న ద్వీపం లాంటి ఊరు మధ్యలో కాలువ, సువర్ణముఖి నదిని దాటితే గాని ఊరిని చేరలేం.
అయితే మా ఐదుగురిని మోసుకుంటూ ఆమె ఆ కష్టమైన దారిలోనే ప్రయాణించేది.అది ఎంత కష్టమో ఆలోచించండి.అప్పుడప్పుడు ఇవ్వన్నీ తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.నా గొంతును అందరూ మెచ్చుకుంటూవుంటే ఈ మాటలు నా తల్లి వింటే ఎంత బాగుండేది పరమేశ్వరా అని అప్పుడప్పుడు బాధపడుతూ వుంటాను.నాకు నా కన్నతల్లే కన్నప్ప అంటూ మోహన్ బాబు చెప్పొకొచ్చారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: