మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఈనెల 27న థియేటర్లలోకి రానుంది.ఈసినిమాలో విష్ణు నటించడమే కాకుండా నిర్మాత కూడా వ్యవహరించాడు.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో విష్ణు ఈసినిమాను తీరిక లేకుండా ప్రమోట్ చేస్తున్నాడు.పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తూ బిజీ అవుతున్నాడు.మంచు మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించడంతో కన్నప్పపై అంచనాలు భారీగా వున్నాయి. సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ముకేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా ఈసినిమా కోసం విష్ణు బాగానే ఖర్చు పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు మై కన్నప్ప స్టోరీ అనే వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశాడు.కన్నప్ప మహా శివుడి పరమ భక్తుడు.అయితే ఒకానొక సందర్భంలో ఆ శివుడు, కన్నప్పని పరీక్షించగా కన్నప్ప తన రెండు కళ్లను త్యాగం చేస్తాడు.తన జీవితాన్నే శివుడికి అంకింతం చేశాడు.మన జీవితాల్లో కూడా ఎవరు ఒకరు కన్నప్ప వుంటారు.నాజీవితంలో కూడా కన్నప్ప వున్నారు.ఆయనే మా నాన్న .
అయన ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారు.నాన్న కష్టం లేకపోతే ఈరోజు నేను మీ ముందు కూర్చుండే వాడిని కాదు.అలాగే మీ జీవితంలో కన్నప్ప ఎవరో చెప్పండి.మీ కన్నప్ప స్టోరీని ప్రపంచానికి తెలియజేస్తాం అంటూ విష్ణు ఈవీడియో ద్వారా కోరాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























