బోయపాటి శ్రీనివాస్ ,బాలకృష్ణ కాంబినేషన్ లో ప్రస్తుతం అఖండ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఈసినిమా షూటింగ్ గత కొద్దీ రోజుల నుండి జార్జియాలో జరుగుతుంది.ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ తో 75శాతం షూటింగ్ పూర్తయినట్లే.ఇక ఈనెల 10న బాలకృష్ణ బర్త్ డే ఉండడంతో ఆరోజు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రేపు ఈ టీజర్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఈ టీజర్ ఓ రేంజ్ లో వుండనుందని టాక్.అలాగే సినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఇంతకుముందే ప్రకటించినా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ కూడా అదే డేట్ ను లాక్ చేసుకుంది.దాంతో అఖండ 2 రిలీజ్ డేట్ మారుస్తారో లేక అదే డేట్ కు వస్తుందో టీజర్ వచ్చాక క్లారిటీ వచ్చే ఛాన్స్ వుంది.
ఈసినిమాలో యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.అఖండ 2 తెలుగు తోపాటు మిగితా భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























