పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు గురించి సీఎంతో చర్చించారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనంతరం దీనిపై మేకర్స్ సోషల్ మీడియాలో ఇలా తెలిపారు.. “ఈ సినిమా 17వ శతాబ్దంలో జరిగినందున, ఇది సాధారణ వాణిజ్య చిత్రాలకు భిన్నంగా భారీ స్థాయిలో రూపొందించబడిన చారిత్రక ఇతిహాసం. ఈ సమావేశంలో తెలంగాణలో టిక్కెట్ ధరల సవరణ విషయం కూడా ప్రస్తావించబడింది. మా విలువైన సమయాన్ని మరియు మద్దతును దయతో ఇచ్చినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు.
కాగా హరిహర వీరమల్లులో ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మనోజ్ పరమహంస కెమెరా, తోట తరణి ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























