రీసెంట్ గా హిట్ 3తో ప్రేక్షకులముందుకు వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నాని.ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిలింగా తెరకెక్కగా థియేటర్లలో అదరగొట్టింది.ఇక థియేట్రికల్ రన్ ఎండింగ్ కి చేరుకోవడంతో ఓటిటి లోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈరోజు నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.మరి థియేటర్లలో కాసులు కురిపించిన ఈసినిమా ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాని కెరీర్ లో ఇది 3వ 100 కోట్ల సినిమా.ఇంతకుముందు దసరా ,సరిపోదా శనివారంతో ఈ ఫీట్ సాధించాడు.ఇక అటు నార్త్ అమెరికాలో ఈసినిమా 2 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.శైలేష్ కొలను తెరకెక్కించిన ఈసినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.నానితో కలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు.
ఇక నాని నెక్స్ట్ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ది ప్యారడైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.జూన్ లో షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇందులో నాని డిఫ్రెంట్ గెటప్ లో కనిపించనున్నాడు.సుధాకర్ చెరుకూరి ఈసినిమాని నిర్మించనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.వచ్చే ఏడాది మార్చి 26న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























