సంబరాల ఏటిగట్టు.. 75శాతం షూటింగ్ పూర్తి

Sambarala Yeti Gattu 75 Percent Filming Wrapped

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG) తో తన కెరీర్‌ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ భారీ విజయం తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ గ్రిట్టీ, ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఎలక్ట్రిఫైయింగ్ గ్లింప్స్ తో ఇప్పటికే భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. కంటెంట్, స్కేల్ రెండింటిలోనూ అత్యున్నత స్థాయిలో దూసుకుపోతున్న SYG ఇప్పుడు ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ ని చేరుకుంది. ఈ చిత్రం 120 షూటింగ్ రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది, దాదాపు 75% షూట్ పూర్తయింది. ఈ సక్సెస్ ఫుల్ టీం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ ని రూపొందిస్తోంది.

ప్రస్తుతం, టీం మూడు భారీ సెట్‌లను నిర్మిస్తున్నారు, ఇవి నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్‌కు కీలకమైన బ్యాక్ డ్రాప్స్ గా వుంటాయి. ఈ సెట్స్‌లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు, ఇవి సినిమాలో విజువల్స్ పరంగా అద్భుతంగా, కథనం పరంగా మోస్ట్ ఎక్సయిటింగ్ గా వుండబోతున్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.

SYG లో సాయి దుర్గ తేజ్ కెరీర్ రీడిఫైన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర ఇప్పటివరకు అతని కెరీర్‌లో మోస్ట్ పవర్ ఫుల్, ఎమోషన్స్ పరంగా అద్భుతంగా వుండబోతోంది. ఇందులోక్యారెక్టర్ కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. ఈ పవర్ ఫుల్ గ్రిప్పింగ్ కథ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ప్రతిష్టాత్మక తారాగణం ఈ చిత్రానికి పని చేస్తుండగా, రాబోయే రోజుల్లో అఫీషియల్ గా నటీనటులని అనౌన్స్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింతగా పెంచనున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న ఈ సినిమా, సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మైల్ స్టోన్ గా నిలవనుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీకి వెట్రి పళనిసామి అందిస్తుండగా సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ సమకూరుస్తున్నారు, నవీన్ విజయ కృష్ణ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైన్ గాంధీ నడికుడికర్. ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.