యంగ్ హీరో విజయ్ దేవరకొండ- జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్డమ్.ఈనెల 30నే రిలీజ్ కావాల్సివుండగా సినిమా ఇంకా రెడీ కాకపోవడంతో వాయిదావేశారు.ఇక జూలై 4న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అనిరుధ్ ఈసినిమా మీదనే పనిచేస్తున్నాడు.మ్యూజిక్ వర్క్ కంప్లీట్ అయితే సినిమా రెడీ అయినట్లే.ఇక సినిమా గురించి అనిరుధ్ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో స్పందించాడు. కింగ్డమ్ చూసాను.చాలా బాగుంది, సూపర్ గా తీశారు అంటూ చెప్పొకొచ్చాడు.అనిరుధ్ రివ్యూస్ చాలా వరకు నిజమయ్యాయి.మరి కింగ్డమ్ విషయం లో కూడా అదే జరుగుతుందో చూడాలి.ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.
ఇక విజయ్ ప్రస్తుతం మరో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు.అందులో ఓ సినిమాను రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా తో చేయనున్నాడు.సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.అలాగే టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో కూడా విజయ్ ఓ సినిమా చేయనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.విజయ్ ఈ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























