గత ఏడాది యానిమల్ తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన మూడో సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయనున్నాడని తెలిసిందే. ఈసినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృత గా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు సందీప్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక స్పిరిట్ టీం ప్రస్తుతం హీరోయిన్ ను వెతికే పనిలో వుంది.ముందు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు కానీ కుదురకపోవడంతో ఇప్పుడు మరొకరిని ఎంపిక చేసే పనిలో వున్నారు.ఈ రేస్ లో కన్నడ నటి రుక్మిణి వసంత్ పేరు ఎక్కువగా వినపడుతుంది.సందీప్ కూడా ఈమెను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నాడట.త్వరలోనే ఈ హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా టీ సిరీస్ నిర్మించనుంది.
ఇక ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు.అందులో ది రాజాసాబ్ ఒకటి.మారుతి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పుటివరకు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈసినిమాతోపాటు ప్రభాస్ ,హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు.40శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























